BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 13 February 2026, 01:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

తెలంగాణ
13 Feb, 2026 - 01:54 AM
310 వీక్షణలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం/ నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్  శ్రీశైలం, ఫిబ్రవరి 12, 2026: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కలిసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణ పూర్వకంగా స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ఇతర ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.చారిత్రక ప్రాధాన్యం గల శ్రీశైలక్షేత్రంలో పూర్వకాలం నుంచి రాజులు, చక్రవర్తులు ఉత్సవాల సందర్భంలో పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, దసరా మహోత్సవాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పిస్తోంది. #Srisailam #MahaShivaratri #SilkVastraSamarpana #TempleTradition #EndowmentsDepartment #AndhraPradesh #TempleNews Follow us on Website Facebook Instagram YouTube