BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 13 February 2026, 08:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ

తెలంగాణ
13 Feb, 2026 - 08:12 AM
348 వీక్షణలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు: తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ NTODAY NEWS: శ్రీశైలం / నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరఫున శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఉప కార్యనిర్వహణాధికారి ఎం. లోకనాథం దంపతులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలకు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం మేళతాళాల నడుమ ఆలయ ప్రవేశం చేసి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టిటిడి ప్రతినిధులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొనడం తమకు ఆనందదాయకమని పేర్కొన్నారు. #Srisailam #Mahashivaratri2026 #TTD #SilkVastram #TempleTraditions #AndhraPradeshTemples Follow us on Website Facebook Instagram YouTube