BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 January 2026, 09:15 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం

తెలంగాణ
14 Jan, 2026 - 09:15 AM
373 వీక్షణలు

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం

కేటీఆర్ విమర్శలు అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: జగిత్యాల జిల్లా, ధర్మపురి ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు ప్రజల దృష్టిని మళ్లించే అటెన్షన్ డైవర్షన్ డ్రామాలేనని తీవ్రంగా విమర్శించారు. పాలనలో విఫలమై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అబద్ధాల రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. కృష్ణ జలాల అంశంలో ప్రజలను కావాలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఈ అంశంపై చర్చకు వస్తే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. కృష్ణ–గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యతతో, చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర సంపదను దోచుకున్న పాపాల ఫలితంగా నేడు రాష్ట్రం భారీ ఆర్థిక భారాన్ని మోస్తోందని అన్నారు. దోపిడీ పాలనకు అలవాటు పడిన బీఆర్ఎస్‌కు ప్రజా ప్రభుత్వం జవాబుదారీ పాలన అంటే ఏమిటో చూపిస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్‌కు ప్రజలు గట్టి తీర్పు చెప్పారని, ఇది కేవలం ఆరంభమేనని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ప్రజలు పూర్తిగా తిరస్కరించబోతున్నారని స్పష్టం చేశారు. కేటీఆర్ చేస్తున్న విమర్శలు వాస్తవాలకు దూరమైనవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలే తప్ప మరొకటి కాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తేల్చిచెప్పారు. #AdluriLaxmanKumar #Dharmapuri #CongressGovernment #KTR #BRS #TelanganaPolitics #PressMeet #PublicAccountability Follow us on Website Facebook Instagram YouTube