BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 02 March 2026, 07:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు

తెలంగాణ
02 Mar, 2026 - 07:14 AM
224 వీక్షణలు
వేసవిలో తాగునీటి సమస్య నివారణకు ముందస్తు చర్యలు NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా చిన్న కాపర్తి గ్రామ పంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇంటింటికీ సాగర్ నీటిని సరఫరా చేయాలనే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ ఆవుల సుందరయ్య యాదవ్ ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన పైప్‌లైన్‌లను మరమ్మతు చేయించడంతో పాటు మొత్తం ఐదు గేట్‌వాల్వులను ఏర్పాటు చేసి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న ప్రధాన పైప్‌లైన్‌ను సరిచేశారు. అదేవిధంగా 8వ వార్డులో రెండు గేట్‌వాల్వులు, 9వ వార్డులో ఒక గేట్‌వాల్వును నూతనంగా అమర్చారు. ఈ చర్యలతో నీటి సరఫరా మరింత సక్రమంగా జరుగుతుందని సర్పంచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి కాలంలో గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు రుద్రారపు లక్ష్మణ్, రొండి నర్సింహా, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, ఈరమళ్ళ దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, దేశాపాక మధు, పెర్కా నాగరాజు, మాజీ సర్పంచ్ వలిగొండ సోమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు నందిపటి మహేష్, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు. #WaterManagement #SummerPreparedness #Chityal #NalgondaDistrict #DrinkingWater #VillageDevelopment Follow us on Website Facebook Instagram YouTube