BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 June 2026, 02:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ – యువనేతకు మరోసారి అవకాశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jun, 2026 - 02:41 PM
140 వీక్షణలు

తెలుగుదేశం పార్టీ (టెదేపా) తమ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. పార్టీకే దగ్గర‌గా ఉండే విధంగా, సామాజిక సమతూకాన్ని పాటిస్తూ, యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిచ్చి ఈ ఎంపికను చేయడం జరిగింది. అభ్యర్థులుగా ఎంపికైన వారు:

భాష్యం రామకృష్ణ – విద్యావేత్త, పార్టీ కష్టకాలంలో ఆర్థిక, వ్యూహాత్మకంగా మద్దతుగా నిలిచిన ప్రముఖుడు.

సానా సతీష్ – కాకినాడకు చెందిన, గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన నాయకుడు. కాపు సమాజానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ మరోసారి అవకాశం.

చింతకాయల విజయ్ – యువ నేత, బీసి సమాజానికి ప్రాతినిధ్యం. తండ్రి అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం శాసనసభాపతి. గతంలో అనకాపల్లి లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పొత్తుల కారణంగా త్యాగం చేయాల్సి వచ్చింది.

మూడో స్థానంపై చివరి నిమిషం వరకు సీనియర్ నేత వర్ల రామయ్య కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం భవిష్యత్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ విజయ్ వైపే మొగ్గు చూపింది.

రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో టీడీపీ మూడు, మిత్రపక్ష జనసేనకు ఒక స్థానం కేటాయించబడింది. జనసేన అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేయనున్నారు. ప్రస్తుత శాసనసభలో కూటమికి ఉన్న మాజినిటీ ఆధారంగా, ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా, పోటీ లేకుండా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.