BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 05:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:25 PM
166 వీక్షణలు

రాజ్యసభకు షర్మిల? కర్ణాటక నుంచి అవకాశం ఉన్నట్లు ప్రచారం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసిన షర్మిల, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

అయితే పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించాలని ఉన్న తన ఆకాంక్షను రాజ్యసభ ద్వారా నెరవేర్చుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఆమెను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

వైఎస్ కుటుంబంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. షర్మిల రాజ్యసభకు ఎన్నికైతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు, కుమార్తె ఇద్దరూ పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన వారిగా నిలుస్తారు.

అయితే షర్మిల రాజ్యసభ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు