BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 22 June 2026, 10:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా.. చెల్లించకపోతే జైలు శిక్ష..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:41 PM
137 వీక్షణలు

రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1989 రైల్వే చట్టంలో కీలక సవరణలు చేసింది. జన విశ్వాస్ చట్టం కింద తీసుకొచ్చిన ఈ మార్పులతో రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) అధికారాలకు మరింత బలం చేకూరింది.

కొత్త నిబంధనల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం, మహిళల కోచ్‌లో అనుమతి లేకుండా ప్రవేశించడం, రైళ్లలో ధూమపానం చేయడం వంటి ఉల్లంఘనలకు ఆర్పీఎఫ్ అధికారులు ఇకపై అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనున్నారు. కాజీపేటలో ఈ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

గతంలో జరిమానాల వసూళ్ల విషయంలో ఆర్పీఎఫ్ అధికారాలు పరిమితంగా ఉండగా, తాజా సవరణలతో ఈ నెల 15 నుంచి నేరుగా చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు. విధించిన జరిమానాను చెల్లించకపోతే సంబంధిత వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.

 రైలులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి.. లేదంటే భారీ ఫైన్‌తో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు.