BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 03:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 03:38 PM
146 వీక్షణలు

రైతు భరోసా: నేడు రెండో విడత నిధులు జమ

తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం, యాసంగి పంటల సాగులో రైతులకు ఆర్థిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నేడు రెండో విడత నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి.

ఈ పథకం కింద ప్రతి రైతుకు రెండు విడతల్లో సంవత్సరానికి రూ.12,000 అందించాలన్న లక్ష్యంతో రూ.6,000 చొప్పున ఏకరానికి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయబడతాయి. మొదటి విడత నిధులు ఇప్పటికే ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా మార్చి 22న సిద్ధిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో మొదటి విడత నిధులుగా రూ.3,590 కోట్లు 1.5 కోట్ల ఎకరాలకు రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే.

నేడు, భూపాలపల్లి జిల్లా కాటారం వద్ద జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రెండో విడతగా 45,11,947 మంది రైతులకు రూ. 2,206 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. ఈ రెండో విడత నిధుల విడుదలతో రెండు విడతలలో మొత్తంగా రూ.5,653 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

రెండో విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు జమ కానున్నాయి. మూడో విడత నిధుల విడుదల ఈ నెలాఖరులో జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే, మూడో విడతలో మరో ఎకరాని, ఐదు ఎకరాల వరకు నిధులు అందిస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయడానికి ప్రతి సీజన్‌కు సుమారు రూ.9,000 కోట్ల అవసరం ఉంటుందట. ఇందుకు ప్రతీ సీజన్‌లో మొత్తంగా రూ.18,000 కోట్లు అందించాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వానికి ఈ మొత్తం సర్దుబాటు చేయడం చాలా కష్టం కావడం వల్ల, విడతల వారీగా నిధులు జమ చేస్తోంది.

రెండో విడత నిధులు అందుకోలేని రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ లేదా రెవెన్యూ శాఖ అధికారులతో సంప్రదించి, అర్హత నిర్ధారించుకోవాలి. అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయి.

రెండో విడత పూర్తయిన వెంటనే, మూడో విడత నిధులను కూడా విడుదల చేయటానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు మూడో విడత నిధులు ఈ నెలాఖరులోపు జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.