BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 30 June 2026, 08:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 08:02 PM
93 వీక్షణలు

రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘రైతు భరోసా సదస్సు’లో రైతులకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సుమారు 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లను జమ చేసినట్లు సీఎం ప్రకటించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, రైతుల పెట్టుబడి భారం తగ్గించడం లక్ష్యంగా రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.