BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 29 April 2026, 04:33 pm
Posted by : V శ్రీనివాస్

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 Apr, 2026 - 04:33 PM
134 వీక్షణలు

​రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలు ఏవి?: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు

మంచిర్యాల జిల్లాలో వరి మరియు మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలుదారులు కరువవ్వడంతో అన్నదాతలు రోడ్డున పడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా వరి, మొక్కజొన్న పంటలు కళ్ళాల్లోనే నిల్వ ఉండి పాడవుతున్నా, ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని గాలికొదిలేసిందని విమర్శించారు. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెబుతున్న అభివృద్ధి మాటలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో రైతుల దుస్థితి చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుందని రఘునాథరావు పేర్కొన్నారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను తెరిచి, మద్దతు ధరతో పంటను సేకరించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు