BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
21 Jun, 2026 - 08:45 PM
114 వీక్షణలు

లక్షెట్టిపేట మండలం దౌడేపల్లిలో జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి - విత్తన శుద్ధి కేంద్రం ప్రారంభం

మంచిర్యాల, జూన్ 21: రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం అనేక నిర్మాణాత్మక చర్యలు చేపడుతోందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి (చందారం)లో చందారం గ్రామ రైతు పొదుపు, పరపతి, మార్కెటింగ్ పరస్పర సహాయక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'జాతీయ గ్రామీణ విత్తన ఉత్పత్తి - విత్తన శుద్ధి కేంద్రాన్ని' మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సౌకర్యార్థం ఈ విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇందుకు అవసరమైన మెటీరియల్, పరికరాలను ప్రభుత్వం సమకూరుస్తుందని తెలిపారు.

​జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించామని, మిగిలిన 12 వేల క్వింటాళ్లను త్వరలోనే కొనుగోలు చేస్తామని చెప్పారు. రవాణా కొరత లేకుండా సింగరేణి, ఇసుక లారీలను మళ్లించి, వర్షాలు రాకముందే ధాన్యాన్ని గోదాములు, రైస్ మిల్లులకు తరలించామన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 98 శాతం మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు. ఆధార్ లింకేజీ ద్వారా విత్తనాలు, యూరియా బుకింగ్ చేస్తున్నామని, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, మారుమూల గ్రామాల్లో భూ సమస్యల సర్వే పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పంట మార్పిడి, నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

​మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. జిల్లాలో వరితో పాటు 22 వేల టన్నుల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రూ.452 కోట్ల చెల్లింపులు జరగ్గా, ఒక్క మంచిర్యాల నియోజకవర్గంలోనే దాదాపు రూ.270 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 20 శాతం కొనుగోలు కేంద్రాలను ఐ.కె.పి. (IKP)కి కేటాయించామని, కడెం కాలువ 42వ డిస్ట్రిబ్యూటరీ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ సకాల చర్యల వల్ల గతంలో ఎకరాకు 20-22 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈసారి 28 నుంచి 32 క్వింటాళ్ల రికార్డు స్థాయి దిగుబడి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

​రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కొత్త విత్తన శుద్ధి కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను మార్కెట్ ధరల ప్రకారం అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు