BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 15 May 2026, 02:40 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెంలో విజయవంతంగా TB ముక్త భారత్ ఉచిత వైద్య శిబిరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 02:40 PM
175 వీక్షణలు

రెడ్డిగూడెంలో విజయవంతంగా “TB ముక్త భారత్” ఉచిత వైద్య శిబిరం

ప్రజలతో మమేకమైన ప్రజల సేవకుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి

ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న “TB ముక్త భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా రెడ్డిగూడెం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్షల శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఈ కార్యక్రమంలో ప్రజల సేవకుడు ముప్పిడి నాగేశ్వర రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. “వ్యాధి వచ్చిన తర్వాత చికిత్సకంటే ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ఎంతో మేలు చేస్తుంది” అని సూచిస్తూ TB ముక్త భారత్ కార్యక్రమం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శిబిరానికి వచ్చిన ప్రజల కోసం ప్రత్యేకంగా మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. మహిళలు, వృద్ధులు, రైతులు, యువతతో నాగేశ్వర రెడ్డి మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదేవిధంగా శిబిరంలో ఏర్పాటు చేసిన TB పరీక్షల విభాగం, డిజిటల్ ఎక్స్‌రే కేంద్రాన్ని సందర్శించి వైద్య పరీక్షల నిర్వహణను స్వయంగా పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఈ వైద్య శిబిరంలో TB పరీక్షలతో పాటు BP, షుగర్, హీమోగ్లోబిన్ తదితర ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సేవలను వినియోగించుకున్నారు.

“ఆరోగ్యమే మహాభాగ్యం… ముందస్తు పరీక్షలే సంపూర్ణ రక్షణ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిందని పలువురు అభిప్రాయపడ్డారు.