BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 18 May 2026, 10:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 10:55 PM
177 వీక్షణలు

ఉపాధి హామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్న కూలీలకు ఉపాధి దూరం చేయొద్దని, రెండు ఫోటోల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విస్సంపల్లి నాగరాజు డిమాండ్ చేశారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్, గ్రూప్ ఫోటో, రెండు ఫోటోల విధానం కారణంగా ఉపాధి హామీ కూలీలు పనులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

గత రెండు సంవత్సరాలుగా ఆంక్షల పేరుతో ఫేస్ యాప్ ద్వారా ఫోటోలు తీసే విధానం అమలు చేస్తున్న కారణంగా ఇప్పటికే సగానికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారని తెలిపారు. ఫోటో నమోదు కోసం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు వేచి చూడాల్సి వస్తోందని, దీంతో కూలీల పనిదినాలు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ రెండు ఫోటోల విధానాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ కూలీలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని అవకాశాలు కల్పించాలని నాగరాజు కోరారు.

ఈ కార్యక్రమంలో విజయ్, సుబ్బారావు, లక్ష్మి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.