BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 13 July 2026, 06:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెసిడెన్షియల్ పాఠశాల నీటి సమస్యపై ఎమ్మెల్యే రోషన్ కుమార్ సీరియస్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:18 AM
108 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

యుద్ధ ప్రాతిపదికపై చర్యలకు ఆదేశాలు.. నీటి సరఫరాకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు

చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని ఏపీ రెసిడెన్షియల్ బాలికల ఉన్నత పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ వెంటనే స్పందించారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సమస్య ఎందుకు తలెత్తిందని అధికారులను ప్రశ్నించిన ఎమ్మెల్యేకు, కొంతమంది ఆకతాయిలు నీటి సరఫరా గేటు వాల్వ్‌లను ఇష్టానుసారంగా తిప్పి పాఠశాలకు వెళ్లాల్సిన నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని అధికారులు వివరించారు. దీంతో నిర్ణీత సమయానికి పాఠశాలకు నీరు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఈ వ్యవహారాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా పరిగణించారు. వెంటనే పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తూ, ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల అవసరాలకు ఆటంకం కలిగించే వారి పట్ల ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.

అలాగే మున్సిపల్ అధికారులకు పాఠశాలలో నీటి సరఫరా అంతరాయం లేకుండా వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.