BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 02:48 pm
Posted by : బాల్ధా భాస్కర్

బీబీనగర్‌లో రిషి డెంటల్ క్లినిక్ ప్రారంభం – గ్రామీణులకు ఆధునిక దంత వైద్య సేవలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బీబీ నగర్
Reporter
బాల్ధా భాస్కర్ బీబీనగర్ మండల ప్రతినిధి
04 Apr, 2026 - 02:48 PM
120 వీక్షణలు

బీబీనగర్ మండల కేంద్రంలో వైద్య రంగానికి మరొక కొత్త మెరుగైన సేవ అందుబాటులోకి వచ్చింది. బ్రాహ్మణపల్లి రోడ్డులో డాక్టర్ శ్రీకాంత్ మరియు డాక్టర్ అనూషల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “రిషి డెంటల్ క్లినిక్”ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోలి పింగల్ రెడ్డి హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గోలి పింగల్ రెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామమని తెలిపారు. ముఖ్యంగా దంత వైద్య సేవలు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల ఆరోగ్య పరిరక్షణలో పెద్ద మార్పు వస్తుందని అన్నారు. డాక్టర్ శ్రీకాంత్ మరియు డాక్టర్ అనూషలు ఈ ప్రాంత ప్రజలకు సమర్థవంతమైన, నమ్మకమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

క్లినిక్‌లో ఆధునిక పరికరాలతో చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వైద్యులు తెలిపారు. రోగులకు తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స అందించడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. బీబీనగర్ మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఈ క్లినిక్ ఎంతో ఉపయోగకరంగా మారుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గోలి నరేందర్ రెడ్డి, నాగరాజ్, పింగల్ అన్న సేవాదళ్ అధ్యక్షులు ఎండీ మోయిన్, అంబెపు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

స్థానిక ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలు అందించేందుకు ప్రారంభమైన ఈ రిషి డెంటల్ క్లినిక్, ఆరోగ్య సేవల్లో ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.