BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 February 2026, 10:40 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గంజాయి నిరోధానికి ఆకస్మిక తనిఖీలు

తెలంగాణ
22 Feb, 2026 - 10:40 AM
316 వీక్షణలు
ఆత్మకూరులో గంజాయి నిరోధానికి ఆకస్మిక తనిఖీలు బస్టాండ్‌లో అనుమానితుల తనిఖీ – అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా, ఆత్మకూరు: పట్టణంలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టేందుకు ఆత్మకూరు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లో గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారంతో అర్బన్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్సై డి.వి. నారాయణరెడ్డి సిబ్బందితో కలిసి అనుమానితులను తనిఖీ చేశారు. అవగాహన కార్యక్రమం తనిఖీల అనంతరం ఆటో డ్రైవర్లతో పోలీసులు సమావేశమై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ  మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని, మహిళలు, మైనర్ బాలికల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాచారమిస్తే చర్యలు గంజాయి లేదా ఇతర డ్రగ్స్ సరఫరా జరుగుతోందన్న సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ పట్టణంలో దొంగతనాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. #Atmakur #NandyalDistrict #DrugPrevention #PoliceAwareness Follow us on Website Facebook Instagram YouTube