BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 26 January 2026, 06:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 06:21 AM
232 వీక్షణలు
పాషిగామ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్  -ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ -పాఠశాల అభివృద్ధిపై గ్రామస్తుల ప్రశంసలు వెల్గటూర్ మండలం పాషిగామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం స్వీకరించారు. నూతన పాలకవర్గానికి సన్మానం గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉపసర్పంచ్ కొత్తూరి భూమయ్య మరియు వార్డు సభ్యులను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు. త్వరలో నూతన భవన నిర్మాణం ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ, గతంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాఠశాలను సందర్శించి విద్యా విధానాన్ని అభినందించడం గర్వకారణమని తెలిపారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో త్వరలోనే పాఠశాలకు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంపత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని గ్రామస్తులు ప్రశంసలు వ్యక్తం చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్పంచ్, ఉపసర్పంచ్ చేతుల మీదుగా బహుమతులు, 2026 నూతన క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాండ్రపు శిరీష, ఉపసర్పంచ్ కొత్తూరి భూమయ్య, మాజీ సర్పంచ్ బొప్పూ తిరుపతి, నూతన వార్డు సభ్యులు, గ్రామ యువకులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #RepublicDayCelebrations #GovernmentSchool #PasigamSchool #PrimaryEducation #NationalFlagHoisting #SchoolDevelopment #Velgatur #JagtialDistrict Follow us on Website Facebook Instagram YouTube