BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 February 2026, 04:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పాషిగామ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం

తెలంగాణ
14 Feb, 2026 - 04:45 AM
381 వీక్షణలు
పాషిగామ పాఠశాలలో RO ప్లాంట్ ప్రారంభం – విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని RO (రివర్స్ ఆస్మోసిస్) వాటర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.12 వేల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ను మండల విద్యాధికారి ప్రభాకర్ ప్రారంభించారు. పాషిగామ గ్రామ దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ సదుపాయాన్ని కల్పించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బరుపటి జనార్ధన్, గోపతీ నరేష్, కాండ్రపు మహేష్, ఉప సర్పంచ్ భూమయ్య, అజయ్, రాజు తదితరులు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ, స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా విద్యార్థులను నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుండి రక్షించవచ్చని తెలిపారు. దాతల సామాజిక బాధ్యతను ప్రశంసించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలం సంపత్ కుమార్ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ చొరవను అభినందించారు. కార్యక్రమంలో అల్లం సాయి, కంటేం అంజి, కంటేం రాజు, కంటేం సతయ్య, ఉపారపు సతీష్, నలిమేలా సురేష్, కొట్టె రవి, బరుపటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. #Velgatoor #Pashigam #ROPlant #CleanDrinkingWater #SchoolDevelopment #CommunitySupport #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube