BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 07 April 2026, 08:23 pm
Posted by : కూనురు మధు

సైబర్ నేరాలపై, అప్రమత్తంగా ఉండాలి : రామన్నపేట ఎస్సై డి. నాగరాజు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
07 Apr, 2026 - 08:23 PM
183 వీక్షణలు

సైబర్ నేరాలు, అప్రమత్తంగా ఉండాలి : రామన్నపేట ఎస్సై డి. నాగరాజు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.రామన్నపేట ఎస్సై డి. నాగరాజు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులు క్లిక్ చేయవద్దని ఎస్సై సూచించారు. అంతేకాకుండా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత జీవితాలు ఎలా నాశనమవుతాయో వివరించారు. ​మహిళలు మరియు చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, చిన్నారుల రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరారు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. చైన్ స్నాచింగ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రాముఖ్యతను వివరించారు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి అని తెలిపారు.


 ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నరసింహ, సురేష్, మధులతో పాటు గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.