BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 26 June 2026, 07:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సీఎం అయినా నేను మారలేదు.. నా జీవన విధానం మారలేదు: రేవంత్ రెడ్డి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 07:19 AM
104 వీక్షణలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవి మారినా, వ్యక్తిత్వం మాత్రం మారలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గురువారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచే ఉన్న నడత, నడకే ఇప్పటికీ కొనసాగుతోందని అన్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, నిద్రలో కూడా రాష్ట్ర బాధ్యతలను మర్చిపోనని పేర్కొన్నారు. గత 30 నెలలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు.

అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైన నిధులు, అనుమతులు సాధించేందుకు తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నానని రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజల సంక్షేమమే తన ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.