BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 17 May 2026, 06:22 pm
Posted by : కూనురు మధు

సీఎం రేవంత్ రెడ్డి, విప్ వేముల వీరేశం చిత్రపటాలకు పాలాభిషేకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
17 May, 2026 - 06:22 PM
219 వీక్షణలు

సీఎం రేవంత్ రెడ్డి, విప్ వేముల వీరేశం చిత్రపటాలకు పాలాభిషేకం NTODAY NEWS చిట్యాల 

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చిత్రపటాలకు ఉద్యమకారులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

​ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం అభినందనీయమని అన్నారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉపాధి, ఇళ్లు, విద్యా, వైద్య సదుపాయాలలో ఉద్యమకారులకు ప్రత్యేక కోటా కల్పించాలని, వారి సంక్షేమానికి శాశ్వత విధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సముచిత గౌరవం దక్కుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జోగు లింగస్వామి, కొసనం అశోక్ యాదవ్, చికిలంమెట్ల మెహర్ బాబు, బాస్పాజు రామాచారి, అమరోజు వెంకన్న, జిల్లాపల్లి స్వామి, జోగు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.