BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 12 May 2026, 03:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 03:33 PM
172 వీక్షణలు

సెలవుల్లో హెడ్మాస్టరే వాచ్‌మెన్‌! పాఠశాల ఆస్తికి హెచ్‌ఎంలే బాధ్యులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నప్పటికీ, వాటి భద్రత మాత్రం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2,868 ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్‌మెన్లు లేకపోవడంతో వేసవి సెలవుల సమయంలో హెడ్‌మాస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాఠశాలల్లోని ఫ్యాన్లు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దొంగతనానికి గురైతే సంబంధిత హెచ్‌ఎంలనే బాధ్యులుగా విద్యాశాఖ పరిగణిస్తోంది. దీంతో సెలవుల్లో కూడా పలువురు హెచ్‌ఎంలు పాఠశాలల వద్దే పహారా కాస్తున్నారు.

ఆస్తులు పోతే రికవరీ నోటీసులు వస్తాయనే భయంతో కొందరు ప్రధానోపాధ్యాయులు స్వయంగా పాఠశాలలను పర్యవేక్షిస్తుండగా, మరికొందరు సొంత ఖర్చులతో ప్రైవేట్ వ్యక్తులను కాపలా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది.

వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాల ఆస్తుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.