BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 19 May 2026, 08:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 08:57 PM
164 వీక్షణలు

సికింద్రాబాద్‌లో HMWSSB జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు

రూ.1.05 కోట్ల నగదు.. కేజీ బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు.. నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి గుర్తింపు

రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు అనుమానం

సికింద్రాబాద్‌లోని మల్లాపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న HMWSSB రెడ్ హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ కుమార్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం భారీ స్థాయిలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.1.05 కోట్ల నగదు, సుమారు కేజీ బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారుల ప్రాథమిక విచారణలో నిజామాబాద్ జిల్లాలో 3 ఎకరాల భూమి, హైదరాబాద్ నగరంలో 9 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇంకా పలుచోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం.