BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 05 June 2026, 07:13 am
Posted by : కూనురు మధు

సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం

తెలంగాణ
/ నల్గొండ / మిర్యాలగూడ
05 Jun, 2026 - 07:13 AM
232 వీక్షణలు

సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు సజీవదహనం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఒక రేకుల ఇంట్లో విద్యుదాఘాతం (షార్ట్ సర్క్యూట్) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగానే ఇంట్లోని గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి.

​ఈ ప్రమాదంలో బయటకు రాలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మృతులను అమ్మమ్మ వనం చంద్రకళ (45), మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)గా గుర్తించారు.

​సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు