BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 14 May 2026, 06:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:26 PM
161 వీక్షణలు

సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు

గ్యాస్ ఫికేషన్‌కు కేంద్ర ప్రోత్సాహం.. సింగరేణికి కొత్త అవకాశాలు

కొత్త ప్రాజెక్టులతో ఉపాధి, ఆదాయ వృద్ధిపై ప్రభుత్వ దృష్టి

సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విస్తృత ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేస్తోంది. బొగ్గు నిల్వలు తగ్గిపోతూ మూతపడుతున్న గనుల స్థానంలో కొత్త గనులను ప్రారంభించేందుకు వేగంగా చర్యలు కొనసాగుతున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పర్యవేక్షణలో సింగరేణి సంస్థ 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి దేశీయ వనరులను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో గ్యాస్ ఫికేషన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా బొగ్గు గ్యాస్ ఫికేషన్ ప్రాజెక్టుల అమలుకు సిద్ధమవుతోంది.

వాస్తవానికి దశాబ్దం క్రితమే సింగరేణి ఈ ప్రక్రియపై ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ అవి ముందుకు సాగలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త గనుల అభివృద్ధితో పాటు గ్యాస్ ఫికేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

రాష్ట్రంలో ఉన్న బొగ్గు నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా విద్యుత్, పారిశ్రామిక అవసరాలను తీర్చడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రానున్న రెండు నుంచి మూడు సంవత్సరాల్లో సింగరేణి సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త అవకాశాలకు కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.