BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

సమర్థవంతంగా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 May, 2026 - 04:52 PM
64 వీక్షణలు

సమర్థవంతంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ

​అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలి

​అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి

​జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ల మంజూరు, గృహజ్యోతి, ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం సరఫరా ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు.


​రైతు సంక్షేమ పథకాలైన రైతు భరోసా, రైతు బీమా, సన్న రకాల వడ్లకు బోనస్ వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పంట మార్పిడి, వాణిజ్య పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విద్యా రంగ అభివృద్ధిలో భాగంగా పాఠశాలల్లో అల్పాహార పథకం అమలును పర్యవేక్షించాలని, కొత్త పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.


​ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలు, ఆరోగ్య కేంద్రాలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, ముఖ్య ప్రణాళిక అధికారి పాపయ్య, మున్సిపల్ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, వివిధ మున్సిపల్ చైర్ పర్సన్లు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు