BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 08:53 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

స్టాక్ మార్కెట్‌లో నేటి నుంచి కొత్త టైమింగ్స్.. ట్రేడర్లకు కీలక మార్పులు!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:53 PM
53 వీక్షణలు

స్టాక్ మార్కెట్‌లో నేటి నుంచి కొత్త టైమింగ్స్.. ట్రేడర్లకు కీలక మార్పులు!

ముంబై, ఆగస్టు 3: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ విధానంలో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు నేటి (ఆగస్టు 3) నుంచి అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) స్టాక్స్‌లో ట్రేడింగ్, క్లోజింగ్ ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఇప్పటి వరకు F&O స్టాక్స్‌లో రెగ్యులర్ ట్రేడింగ్ మధ్యాహ్నం 3:15 గంటలకు ముగిసేది. ఇకపై అదే సమయంలో ప్రత్యేక క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) ప్రారంభమై మధ్యాహ్నం 3:35 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సెషన్‌లో కొనుగోలు, అమ్మకాల ఆధారంగా నిర్ణయించే ధరనే ఆ రోజు అధికారిక ముగింపు ధరగా పరిగణిస్తారు.

అదేవిధంగా F&O ట్రేడింగ్ సమయాన్ని మరో 10 నిమిషాలు పొడిగించి సాయంత్రం 3:40 గంటల వరకు కొనసాగించేలా మార్పులు చేశారు. దీంతో ట్రేడర్లకు చివరి దశలో లావాదేవీలు పూర్తి చేసుకునేందుకు అదనపు సమయం లభించనుంది.

అయితే నాన్-F&O ఈక్విటీ క్యాష్ స్టాక్స్‌కు ఎలాంటి మార్పులు లేవు. వాటి ట్రేడింగ్ యథావిధిగా మధ్యాహ్నం 3:30 గంటలకే ముగుస్తుంది.

మార్కెట్ ముగింపు ధర మరింత పారదర్శకంగా నిర్ణయించేందుకు, ధరల్లో చివరి నిమిషాల్లో వచ్చే హెచ్చుతగ్గులను తగ్గించేందుకు ఈ మార్పులు తీసుకొచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.