BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:26 AM
24 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి: కోనసీమ నేతలకు జగన్ దిశానిర్దేశం

తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత కీలకమైనవిగా భావించి పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో జగన్ పార్టీ పరిస్థితి, కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఒక్కో నియోజకవర్గ సమన్వయకర్తతో విడివిడిగా సమావేశమయ్యారు.

జిల్లా నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకులు పాల్గొన్నారు.

జగన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

ఆగస్టు 15 నుంచి పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. నాలుగు నెలల పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు గ్రామాలు, వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడంతో పాటు ప్రజా సమస్యలపై గళం వినిపించాలని ఆదేశించారు.

అనుబంధ విభాగాల నాయకులను సమన్వయం చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని, నియోజకవర్గ పరిశీలకులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఎక్కువ సమయం కేటాయించి స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు.

ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలులో నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలని చెప్పారు. స్థానిక నాయకత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలపై వెంటనే స్పందించాలని సూచించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కూడా అప్రమత్తంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల తర్వాత కూడా అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైతే ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా చేర్పులు, అభ్యంతరాలు, సవరణలు చేయాలని నాయకులకు సూచించారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించిన జగన్, ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, బాధితులకు అండగా నిలుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.