BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 January 2026, 07:07 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

తెలంగాణ
03 Jan, 2026 - 07:07 AM
198 వీక్షణలు

కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కరసనపల్లెలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి, భర్త మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాల పేద మహిళల కోసం పాఠశాలలు స్థాపించి ఉచిత విద్య అందించిందని తెలిపారు. అలాగే బాల్యవివాహాలను అరికట్టడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, అసమానతలు, అంటరానితనం, మూఢనమ్మకాలను రూపుమాపేందుకు విశేషంగా కృషి చేసిందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. చివరికి ప్లేగు వ్యాధితో బాధపడుతున్నవారికి సేవ చేస్తూ అదే వ్యాధితో ఆమె మరణించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం అమర్నాథ్‌తో పాటు ఉపాధ్యాయులు నాగమల్లిక, మనోహర్, రామాంజులు, ప్రేమకుమార్, భాస్కర్, శ్రీనివాసులు, ప్రసూన మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube