BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 24 July 2025, 08:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

27వ తేదీన గ్రామ పాలన అధికారుల రెండవ సెల్ఫ్ స్క్రీనింగ్ రాత పరీక్ష

తెలంగాణ
24 Jul, 2025 - 08:01 AM
219 వీక్షణలు
27వ తేదీన గ్రామ పాలన అధికారుల రెండవ సెల్ఫ్ స్క్రీనింగ్ రాత పరీక్ష-- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ పాలనా అధికారుల రెండవ స్పెల్ స్క్రీనింగ్ రాత పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.గురువారం రోజు మినీ మీటింగ్ హాల్ లో ఈ నెల 27 న జరగబోయే గ్రామ పాలనా అధికారి రెండవ స్పెల్ స్క్రీనింగ్ పరీక్ష పై అధికారులతో,రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భువనగిరి జిల్లా కేంద్రంలోని ( వెన్నెల కాలేజ్ ఆవరణలో గల) భువనగిరి కాలేజీ అఫ్ ఎడ్యుకేషన్, అనంతారం లో ఈ నెల 27వ తేదీన ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు తెలిపారు.జీపీఓటి -2025 నియామకంలో భాగంగా పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏలకు ఆప్షన్ల కింద అవకాశం కల్పించి, వారి నుంచి దరఖాస్తులను కోరడం జరిగిందని, కావునా ఈ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ప్రభుత్వం చే జారీ చేయబడిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు,హాల్ టికెట్ ప్రింట్ తీసుకొని రావాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు 9 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అన్నారు.పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మూత్రశాలలు, తదితర మౌలిక వసతులను కల్పించాలని,వైద్య సిబ్బంది సరిపడా మందులతో కేంద్రం వద్ద అందుబాటులో ఉండాలని, ఎక్కడా కూడా మాస్ కాపీయింగ్ కు ఆస్కారం ఇవ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష సమయాలలో అదనపు బస్సులు ఏర్పాటు చేసి సమయానికి వచ్చేలా చూడాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పక్కాగా,ప్రశాంత వాతావరణంలో పరీక్షను జరిపించాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎవరికీ కూడా మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదన్నారు. అలాగే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు.అదే విధంగా పరీక్ష ప్రశ్న పత్రాలను అత్యంత జాగ్రత్తగా పటిష్ట భద్రత నడుమ పరీక్ష కేంద్రానికి చేరవేయాలని,జవాబు పత్రాలను కూడా నిర్దేశిత ప్రాంతాలకు పంపించాలని సూచించారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రం చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ షాపులు పోలీస్ బందోబస్తుతో మూసి వేయించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube