పలు పాఠశాలల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
తెలంగాణ
పలు పాఠశాలల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా
చిట్యాల మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి, తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.
ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉరుమడ్ల, ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వనిపాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పాత్రలను చేపట్టి తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని కృషి చేయాలని సూచించారు. స్వపరిపాలన దినోత్సవంలో చేపట్టిన బాధ్యతలను భవిష్యత్తులో నిజ జీవితంలో సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ప్రధానోపాధ్యాయుడు ఆర్ వెంకన్న, ఏపూర్ జడ్‌పిహెచ్‌ఎస్ హెచ్ఎం పాలెం పరమేష్, జడ్‌పిహెచ్‌ఎస్ ఉరుమడ్ల ప్రధానోపాధ్యాయుడు బోధనం మోహన్ రెడ్డి, వనిపాకల జడ్‌పిహెచ్‌ఎస్ హెచ్ఎం శ్రీను ఆచారి, దంతూరి సైదులు గౌడ్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
#SelfGovernanceDay #SchoolActivity #Chityal #NalgondaDistrict #StudentLeadership #EducationNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube