BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

శ్రీ కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం.. భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా సీతారాముల కల్యాణం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
107 వీక్షణలు

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ సేవలో వేదమంత్రోచ్ఛారణల నడుమ వైఖానస ఆగమ విధానంలో స్వామివారికి అభిషేకం నిర్వహించగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దివ్యానుభూతిని పొందారు.

పునర్వసు నక్షత్రం, అమావాస్య సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన సహస్ర కలశాభిషేకం ఆలయ ప్రాంగణాన్ని భక్తిరసంతో నింపింది.

అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ వైభవంగా నిర్వహించనున్నారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ కోదండరామస్వామి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్ర దినాలు వైష్ణవ ఆలయాల్లో అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతినెలా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణోత్సవం కూడా మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు కల్యాణ మండపంలో ప్రారంభమైన ఈ మహోత్సవాన్ని అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్త దంపతులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదాన్ని బహుమతిగా అందజేశారు.

ఈ కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సురేష్, అర్చకులు, ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలు భక్తులకు మరపురాని అనుభూతిని అందించాయి.