BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 19 April 2026, 11:11 am
Posted by : యామనూరి మల్లికార్జున

అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 11:11 AM
174 వీక్షణలు

అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి 

శ్రీశైలం దేవస్థానం :-శ్రీ ప్రమోద్ గుప్త, పూణే, మహారాష్ట్ర వారు ఈ రోజు (19.04.2026)  అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని  పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు.  దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.

2- పత్రికా ప్రకటన  

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

  తేది:  19.04.2026



*21న రుద్రమూర్తికి ప్రత్యేకపూజలు*


21వ తేదీ ఉదయం గం. 7.30లకు ఆలయ ఈశాన్యభాగంలో గల రుద్రవనంలో (రుద్రపార్కు)లోని రుద్రమూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహించబడుతాయి.

గతంలో “శంకర జయంతి” రోజున ఈ రుద్రవిగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.  ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం శంకరజయంతి రోజున ఈ పూజాదికాలను నిర్వహించడం జరుగుతోంది. 

ఈ విశేష కార్యక్రమంలో రుద్రమూర్తికి ఆపాదమస్తకంగా విశేషఅభిషేకం మరియు పూజా కార్యక్రమములు నిర్వహించబడుతాయి. 

కాగా రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడు కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి, పంటలు బాగా పండుతాయని, అదే విధంగా శ్రీశైలం ఆనకట్ట ఎల్లప్పుడు పరిరక్షించబడుతూ ఉంటుందని, భవిష్యత్తులో ఆనకట్టకు ఎలాంటి ఇబ్బంది తలెత్తవని పలువురు ఆధ్యాత్మికవేత్తలు సూచించడంతో ఆలయ ఈశాన్యభాగంగా కృష్ణానదికి అభిముఖంగా (రుద్రుని దృష్టి కృష్ణానదిపై పడే విధంగా) ఈ రుద్రుని విగ్రహాన్ని దేవస్థానం నెలకొల్పింది.

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

             శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ