BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 10 June 2026, 06:56 am
Posted by : యామనూరి మల్లికార్జున

శ్రీశైలం సుబ్రహ్మణ్యం స్వామి వారికి విశేష అభిషేకం మరియు పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
10 Jun, 2026 - 06:56 AM
121 వీక్షణలు

శ్రీశైలంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైలం, జూన్ 9: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీశైల దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష అభిషేకం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ప్రతి మంగళవారం, కృత్తికా నక్షత్రం మరియు షష్ఠి తిథి రోజుల్లో దేవస్థానం సేవగా (సర్కారీ సేవగా) ఈ విశేష అభిషేకం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అర్చక స్వాములు దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని సంకల్పం చేశారు.

ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి, అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి పంచామృతాభిషేకం, అర్చన, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం జరిపారు.

సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో ఆరాధించడం వల్ల ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయాలు సిద్ధిస్తాయని, శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టిదోషాలు తొలగిపోతాయని, సంతానం కోసం ప్రార్థించే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ఈ కార్యక్రమం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నిర్వహించబడింది.