BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఒక రోజు ముందే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ

తెలంగాణ
31 Jan, 2026 - 06:54 AM
277 వీక్షణలు
ఒక రోజు ముందే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ఏలూరులో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించిన ఎమ్మెల్యే బడేటి చంటి NTODAY NEWS: ఏలూరు జిల్లా పింఛన్‌దారుల చిరునవ్వులే కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిజమైన చిరునామా అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అర్హులైన మరింత మందికి రానున్న రోజుల్లో సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. శనివారం తెల్లవారుజామునే పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక 22వ డివిజన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ సొమ్ములను అందజేశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్యం, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒక వృద్ధురాలు రేషన్ సరుకులు తీసుకురాలేక ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేయగా, సంబంధిత సిబ్బందిని అక్కడికక్కడే ఆదేశించి, ఇకపై ఆ వృద్ధురాలి ఇంటికే రేషన్ సరుకులు చేరేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ధి చేయని వారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులే తమ పాలనకు నిదర్శనమని చెప్పారు. రానున్న మార్చి నెల నాటికి ఏలూరు నియోజకవర్గంలో మరింత మంది అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కో–ఆప్షన్ సభ్యులు ఎస్‌ఎస్‌ఎమ్‌ఆర్ పెదబాబులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు, టిడిపి డివిజన్ ఇన్‌ఛార్జ్‌లు అట్లూరి రామకృష్ణ, కొండే రాణి నిర్మలా కుమారి, డివిజన్ నాయకులు, కూటమి పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. #Eluru #NTRBharosa #SocialSecurityPension #PensionDistribution #TDP #CoalitionGovernment #WelfareGovernance #PublicService #AndhraPradesh Follow us on Website Facebook Instagram YouTube