BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 July 2025, 08:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా సెయింట్ థెరిసా మహిళా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తెలంగాణ
10 Jul, 2025 - 08:49 AM
254 వీక్షణలు
ఘనంగా సెయింట్ థెరిసా మహిళా కళాశాల 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ, సాధించిన ఘనతకై విజయాలు జరుపుకోవాలన్నారు మదర్ ఆర్నెస్టైన్ ఫెర్నాండెజ్. స్థానిక సెయింట్ థెరిసా మహిళా కళాశాలలో జరిగిన 73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఆర్నెస్టైన్ ఫెర్నాండెజ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి విద్యార్థులను విద్యారంగంలో రాణింపజేసి మహిళా సాధికారత వైపు నడిపించడానికి తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నదని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ మాట్లాడుతూ తమ కళాశాల ఏడు దశాబ్దాలుగా అనేక రంగాలలో ఉత్తమ కళాశాలగా ఎంపికైందని ఈ విజయాల వెనుక కళాశాల యాజమాన్య అధ్యాపకుల విద్యార్థినుల కృషి ఉన్నదని తెలియజేశారు. అనంతరం కళాశాల ఏడు దశాబ్దాల చరిత్రలో సాధించిన విజయాలను, అందుకున్న అవార్డులను గురించి సభకు పవర్ పాయింట్ ద్వారా పరిచయం చేశారు. కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏలూరు డయాసిస్ కి చెందిన ఫాదర్ బి రాజు దివ్య బలి పూజ సమర్పించారు. ఇంటర్మీడియట్ విభాగంలో నీ సంఘ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించామన్నారు. కళాశాల ఇంటర్మీడియట్ విభాగం నుంచి ప్రెసిడెంట్ గాఎం. దుర్గ భవాని, వైస్ ప్రెసిడెంట్ గా ఎస్ సమీరా, సెక్రటరీగా ఎం విన్నీ, జాయింట్ సెక్రటరీగా షేక్ రిజ్వానా, ట్రెజరర్ గా పి పూజ శ్రీ, లీడర్ గా బి జాస్మిన్ ఎన్నికయ్యారని తెలియజేశారు. ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రతినిధులకు కాసాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలోఇంటర్మీడియట్ విద్యార్థుల ఎన్నికలను మ్యాథమెటిక్స్ విభాగం వారు నిర్వహించగా, వ్యవస్థాపక దినోత్సవాన్ని హోమ్ సైన్స్ విభాగం వారు నిర్వహించారు. Follow us on Website Facebook Instagram YouTube