BREAKING
వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు
Date of Publish : 10 January 2026, 06:28 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు

తెలంగాణ
10 Jan, 2026 - 06:28 AM
251 వీక్షణలు
మంత్రుల బహిరంగ సభ నేపథ్యంలో గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ NTODAY NEWS: గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా రేపు (తేదీ: 11-01-2026) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభకు ఐటీ శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బందికి శ్రీ రాజ్యలక్ష్మి గార్డెన్స్, మార్కండేయ కాలనీలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సమగ్ర బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, సభా ప్రాంగణంలోని వేదిక, పబ్లిక్ గ్యాలరీ, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, వీఐపీ మరియు పబ్లిక్ వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్, భోజనాల ఏర్పాట్ల ప్రాంతం తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభ ప్రశాంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, లింగమూర్తి, మంథని సీఐ బి. రాజు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, ఆర్‌ఐ దామోదర్, శ్రీనివాస్, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube