BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 February 2026, 06:44 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు విధించాలి

తెలంగాణ
03 Feb, 2026 - 06:44 AM
286 వీక్షణలు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు విధించాలి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన NTODAY NEWS: నిజామాబాద్ గంజాయి స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు న్యాయం చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం సుభాష్ విగ్రహం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ, జనవరి 23న గంజాయి సరఫరా జరుగుతోందన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవ్ నగర్ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారని తెలిపారు. తనిఖీలను గమనించిన గంజాయి స్మగ్లింగ్ ముఠా పారిపోవడానికి ప్రయత్నించగా, వారిని అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టారని చెప్పారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్య ఎనిమిది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. సౌమ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకే రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్య ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, తెలంగాణలో నగరాల నుంచి గ్రామాల వరకు గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా విస్తరిస్తోందని అన్నారు. ప్రభుత్వం మరియు పోలీసు శాఖ కఠిన నిఘా పెట్టాలని కోరారు. ఇటీవల చర్లపల్లిలో కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్న ఘటనలను గుర్తు చేస్తూ, డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, సౌమ్య మృతికి కారణమైన నిందితులకు అత్యంత కఠిన శిక్షలు విధించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మాదాసు రావణ్, గద్దపాటి రఘువరన్, నాగయ్య, అశోక్, శివ, అదిల్, తరుణ్, కార్తీక్, వేణు, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. #ExciseConstable #SoumyaCase #JusticeForSoumya #StopDrugSmuggling #AntiDrugs #DYFI #TelanganaNews #NizamabadNews #LawAndOrder Follow us on Website Facebook Instagram YouTube