BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 December 2025, 08:04 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

తెలుగు ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులకు ప్రథమ స్థానం

తెలంగాణ
27 Dec, 2025 - 08:04 PM
398 వీక్షణలు

తెలుగు ప్రతిభా పరీక్షల్లో న్యూ విజన్ హైస్కూల్ విద్యార్థులకు ప్రథమ స్థానం

NTODAY NEWS : నకిరేకల్ నియోజకవర్గం నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని న్యూ విజన్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రతిభా పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బీ. వర్షిని, మన సంస్కృతి సంస్థ నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలుగు ప్రతిభా పరీక్షలో విశేష ప్రతిభ కనబరిచి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న శ్రేయకుమారి, రాష్ట్ర స్థాయి హిందీ ప్రతిభా పరీక్షల్లో నల్గొండ జిల్లాకు ద్వితీయ స్థానం సాధించింది. ఈ నెల 14వ తేదీన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మన సంస్కృతి సంస్థ అవార్డుల ప్రధానోత్సవానికి అనివార్య కారణాల వల్ల వర్షిని, శ్రేయకుమారి హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా మన సంస్కృతి సంస్థ ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ ఎం.డి. మహమూద్ అలీ, విద్యార్థులకు అందాల్సిన బహుమతులను పాఠశాల ప్రిన్సిపల్ అశోక్‌కు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా బీ. వర్షినికి వెయ్యి రూపాయల నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయగా, శ్రేయకుమారికి నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు పోటీ తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతిభా పరీక్షలు విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, తెలుగు ఉపాధ్యాయుడు వి. శ్రీను, హిందీ ఉపాధ్యాయురాలు షాహిదా బేగం, ఉమ్మడి నల్గొండ జిల్లా పరీక్షల విభాగం కోఆర్డినేటర్ ఎం.డి. మహమూద్ అలీతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube