BREAKING
thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై
Date of Publish : 15 July 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీటీడీకి రూ.50 లక్షల విరాళాలు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Jul, 2026 - 08:51 PM
93 వీక్షణలు

తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు మంగళవారం మొత్తం రూ.50 లక్షలకుపైగా విరాళాలు అందాయి. భక్తులు అందించిన ఈ విరాళాల డీడీలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అందజేశారు.

గుంటూరుకు చెందిన బృందా న్యూరో సెంటర్ తరఫున డాక్టర్ హనుమ శ్రీనివాస రెడ్డి, సిద్ధార్థ కలిసి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 చొప్పున మొత్తం రూ.30,00,348 విరాళంగా అందించారు.

అదేవిధంగా బెంగుళూరుకు చెందిన శ్రీపతి శ్రీనివాస్, కొటారు సునీల్ కలిసి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించగా, విశాఖపట్నానికి చెందిన చాగర్లమూడి సీతారామయ్య టీటీడీ బర్డ్ ట్రస్టుకు మరో రూ.10,00,116 విరాళంగా సమర్పించారు.

ఈ సందర్భంగా టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు సమక్షంలో విరాళాల డీడీలను ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. భక్తులు ధార్మిక సేవా కార్యక్రమాలకు అందిస్తున్న సహకారం అభినందనీయమని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.