BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 03 April 2026, 08:28 am
Posted by : కూనురు మధు

​తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు

తెలంగాణ
/ హైదరాబాద్
03 Apr, 2026 - 08:28 AM
196 వీక్షణలు

​తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు : రూ.44 వేల కోట్ల భారీ ఆదాయం 

తెలంగాణ రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాలు కాసుల వర్షం కురిపించాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో తొలిసారిగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.44,557 కోట్ల భారీ ఆదాయాన్ని గడించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయంలో 7% వృద్ధి నమోదు కావడం విశేషం.

​ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం. ​ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఈ భారీ ఆదాయంలో  నేరుగా మద్యం అమ్మకాల ద్వారా రూ.39,368 కోట్లు సమకూరాయి. కొత్త దుకాణాల దరఖాస్తు రుసుము, వైన్స్ మరియు బార్ల వార్షిక అద్దె ద్వారా మరో రూ.5,189 కోట్ల ఆదాయం లభించింది. కేవలం డిసెంబర్ నెలలోనే పండుగలు, న్యూ ఇయర్ వేడుకల పుణ్యమా అని రూ.5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.  ​గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) ఎక్సైజ్ శాఖకు రూ.40,209 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా రూ.44,557 కోట్లకు చేరుకుంది. పకడ్బందీ నిఘా, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధ్యమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ​రాష్ట్ర ఆదాయ వనరుల్లో ఎక్సైజ్ శాఖ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండగా, ఈ ఏడాది వచ్చిన రికార్డు స్థాయి వసూళ్లు ప్రభుత్వానికి భారీ ఊరటనిచ్చాయి.