BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 11:39 am
Posted by : కూనురు మధు

తెలంగాణ జాగృతిలో చేరిన సీనియర్ నాయకులు మేడి నరేష్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
04 Apr, 2026 - 11:39 AM
284 వీక్షణలు
తెలంగాణ జాగృతిలో చేరిన సీనియర్ నాయకులు మేడి నరేష్

హైదరాబాద్: తెలంగాణ జాగృతి పక్షాన కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. సీనియర్ రాజకీయ నాయకులు, దళిత్ జస్టిస్ ఫోరమ్ చైర్మన్ మేడి నరేష్ గురువారం తన అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. కవిత వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనుభవం కలిగిన నాయకత్వం:

గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పోటీ చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం మేడి నరేష్‌కు ఉంది. ప్రస్తుతం ఆయన 9tv మీడియా మరియు ప్రజా ఘర్షణ పత్రికల చీఫ్ ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఆయన, ఇప్పుడు జాగృతి బలోపేతానికి నడుం బిగించారు.

కవితమ్మను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం:

ఈ సందర్భంగా మేడి నరేష్ మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. కల్వకుంట్ల కవితను తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు కవితకు, మేడి రాజశేఖర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్య నేతల చేరిక:

మేడి నరేష్‌తో పాటు తెలంగాణ మాధవక్క, లింగగల్ల నర్సింలు, సీమ అంజయ్య, బతుకమ్మ పార్టీ కందాటి మణిపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, డి. నర్సింహా, ఎం. సురేష్, గాలి రవీందర్, చంద్రం వంటి పలువురు సీనియర్ ఉద్యమ నాయకులు పార్టీలో చేరారు.

​ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, బొల్లంపల్లి సందీప్, HMS రాష్ట్ర అధ్యక్షులు తిప్పారపు సారయ్య, నాయకులు హైద ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.