BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 22 June 2026, 10:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ రైతులకు శుభవార్త.. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:47 PM
100 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే వార్త. వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మళ్లీ చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

గత 15 రోజులుగా అనుకూల పరిస్థితులు లేక భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు మాత్రమే విస్తరించి నిలిచిపోయిన రుతుపవనాలు తాజాగా మళ్లీ వేగం పుంజుకున్నాయి. సోమవారం నాటికి అవి నిజామాబాద్ వరకు విస్తరించాయని, మంగళవారం నాటికి తెలంగాణ అంతటా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఎండల తీవ్రత తగ్గి, రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.

సోమవారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వాతావరణ సూచనలను గమనిస్తూ వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు. నైరుతి రుతుపవనాల పూర్తి విస్తరణతో రాష్ట్రంలో సాగు పనులు మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.