BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 June 2026, 03:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు ఎవరు అడ్డుకోవడం లేదు?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 03:26 PM
132 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నుంచి టిప్పర్ల ద్వారా తెలంగాణ సరిహద్దు గ్రామాలైన లింగగూడెం, గురుపట్లగూడెం, మల్లేశ్వరం, ఎండపల్లి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా దుద్దిపూడి, సత్తుపల్లి, గంగారం తదితర గ్రామాలకు ఈ ఇసుక తరలించబడుతూ, టన్నుకు 1200 రూపాయల పైగా ధరకు అమ్మడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలుగుతోంది. ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక అందించేందుకు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీని బ్రోకర్లు పూర్తిగా దెబ్బతీయడం గమనార్హం. టిప్పర్ డ్రైవర్ల వద్ద టన్నుకు 500 రూపాయలకు కొనుగోలు చేసి, 1200 రూపాయలకు పైగా విక్రయించడం ఈ అక్రమ వ్యాపారపు లక్షణం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టిప్పర్ల యజమానులు చింతలపూడి అడ్డాగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారు. సంబంధిత శాఖలు ఈ రవాణా పరిస్థితిని గమనించినా చీమకుట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు కనిపించడం ప్రజల మనోభావానికి కూడా ఆవేశాన్ని కలిగిస్తోంది. ఇసుక రవాణా మీద సమగ్ర, తక్షణ చర్యల ఆవశ్యకత ఇప్పుడు మరింత పెరిగింది.