BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 26 June 2026, 06:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఆర్డీవో హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
106 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దమ్ము చక్రాల ట్రాక్టర్లు, ఓవర్‌లోడ్ ఆటోలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరువూరు ఆర్డీవో ఏ.కుమార్ హెచ్చరించారు. స్కూల్, కాలేజీల సమయాల్లో దమ్ము ట్రాక్టర్లు, ఓవర్‌లోడ్ వాహనాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, డ్రైవర్ సీటు పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని వాహనదారులకు సూచించారు.

దమ్ము చక్రాల ట్రాక్టర్ల వల్ల రోడ్లు వేగంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్న ఆర్డీవో, వర్షాకాలంలో రోడ్లపై అతివేగంగా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏ.కుమార్ స్పష్టం చేశారు.