BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 07:12 pm
Posted by : కూనురు మధు

తల్లిపాలే శిశువులకు శ్రీరామరక్ష

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
15 Apr, 2026 - 07:12 PM
199 వీక్షణలు

తల్లిపాలే శిశువులకు శ్రీరామరక్ష   NTODAY NEWS చిట్యాల 

పెదకాపర్తిలో 8వ పోషణ్ పక్షోత్సవాలు.

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పెద్ధకాపర్తి గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రంలో 8వ పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం 'పోషణ్ పక్షం-2026' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ మునుగోడు ప్రాజెక్ట్ ఏసీడీపీఓ వెంకటమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు చిన్న పిల్లల తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యత, పోషకాహార విలువలు, మరియు పిల్లల మెదడు అభివృద్ధిపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు.  పిల్లల్లో మొబైల్ వినియోగాన్ని తగ్గించేందుకు 'నో స్క్రీన్ అవర్' మరియు 'స్మైల్ టైమ్' గురించి వివరించారు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం మరియు పిల్లల ఎదుగుదలపై తల్లులకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల వంటకాలపై ప్రదర్శన నిర్వహించి వాటి యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు ఎం. సుజాత, బి. గీత, పి. సత్యవతి, ఆయాలు మమత, అనసూయతో పాటు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.