BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 06:16 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తండ్రిని కొరియర్ చేయాలా? సమాజాన్ని కలచివేసిన ఘటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:16 AM
328 వీక్షణలు

తండ్రిని కొరియర్ చేయాలా?  సమాజాన్ని కలచివేసిన ఘటన

బెంగళూరు, మార్చి 21: నగరంలోని వినాయక సర్కిల్ పరిధిలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. బస్సు ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో నిరసనగా ఒక కుటుంబం తమ వృద్ధ తండ్రిని మంగళూరుకు పంపేందుకు కొరియర్ సేవలను ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది.

వ్యాలీకావల్ ప్రాంతంలోని ఒక కొరియర్ కార్యాలయానికి వెళ్లిన కుటుంబ సభ్యులు గోనె సంచిలో ఉన్న పెద్ద ప్యాకేజీని పంపాలని సిబ్బందిని కోరారు. అనుమానం వచ్చిన సిబ్బంది సంచిని విప్పి చూడగా అందులో ఒక వృద్ధుడు ఉండటంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమస్యల పరిష్కారానికి ఇలాంటి అవమానకరమైన మార్గాలు ఎంచుకోవడం సమాజానికి మంచిది కాదని పెద్దలు సూచిస్తున్నారు.

పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.