BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

మహిళల ఉన్నతి..తెలంగాణ ప్రగతి.

తెలంగాణ
19 Nov, 2025 - 09:38 AM
224 వీక్షణలు
మహిళల ఉన్నతి..తెలంగాణ ప్రగతి.. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా ఆడబిడ్డలకు సారె గా..ఇందిరమ్మ చీర. ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమం పై సచివాలయం నుండి బుధవారం రోజున అన్ని జిల్లాల కలెక్టర్లు,మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,వాకాటి శ్రీహరి,సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,సేర్ఫ్ సీఈఓ దివ్యదేవరాజన్,ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ...ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించుకున్నామన్నారు. ఆడబిడ్డలకు సారె,చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయం ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. నియోజకవర్గాల్లోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు.ఒక పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టండన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు..వాటికి మహిళలను యజమానులను చేశామన్నారు. స్కూల్స్ లో యూనిఫారం కుట్టే కుట్టుపని బాధ్యత మహిళా సంఘాలకే అప్పగించామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు,శిల్పారామంలో 3ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం ఆన్లైన్ మార్కెట్ కోసం అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నాం జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కోటి మంది మహిళలలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు.మార్చి1నుంచి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుందన్నారు.కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు,సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టేలా చేశామన్నారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంత రావు అధికారులు,మహిళా సమాఖ్య వారితో మాట్లాడుతూ జిల్లాలో 1,91,811 మంది సంఘ సభ్యులు ఉన్నారని1,80,769 మందికి ఇప్పటివరకు ఇందిరమ్మ చీరలు వచ్చాయన్నారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఇందిరమ్మ చీరల పంపిణి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మండల స్థాయి, గ్రామ స్థాయి లో ఒక కమిటీని ఏర్పాటు చేసి చీరల పంపిణి సజావుగా జరిగేలా చూడాలన్నారు. చీరల పంపిణీ చేయగానే సంబంధిత మహిళ అక్విటెన్స్ ను,ఫేషియల్ రికగ్నైజేషన్ వివరాలని పంపించాలని జిల్లా,మండల మహిళా సమాఖ్య అధ్యక్షులకు కలెక్టర్ తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, జడ్పీ సీఈవో శోభారాణి,ఆర్డీవో కృష్ణారెడ్డి,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,సంబంధిత అధికారులు, డీపీఎంలు,ఏపీఎంలు,జిల్లా , మండల సమాఖ్య అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube