BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 February 2026, 03:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరు

తెలంగాణ
04 Feb, 2026 - 03:33 AM
320 వీక్షణలు
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం హోరు జగిత్యాలలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున దావ వసంత, రాజేశం గౌడ్ ముమ్మర ప్రచారం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 42వ, 49వ వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులు ఎలామాద్రి కిషోర్, శ్రీపాద సంతోష్‌లకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. పట్టణ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అయిల్నేని వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.   #BRS #MunicipalElections #Jagtial #CarSymbol #ElectionCampaign #TelanganaPolitics #LocalBodyElections Follow us on Website Facebook Instagram YouTube