BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు

తెలంగాణ
27 Jan, 2026 - 10:10 PM
238 వీక్షణలు
సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు NTODAY NEWS: హైదరాబాద్ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతరను అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ పండుగను వనదేవతల మహోత్సవంగా నిర్వహించాలన్నారు. కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా భారీ నిధులు కేటాయించి మేడారం ఆలయాన్ని పునర్నిర్మించినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రూ.250 కోట్ల వ్యయంతో ఆలయ ప్రాకారం విస్తరణతో పాటు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను విశాలంగా నిర్మించినట్లు తెలిపారు. గిరిజన ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా గద్దెల ప్రాంగణాన్ని ఆధునీకరించి, నలుదిశలా తోరణాలు నిర్మించామని పేర్కొన్నారు. లక్షలాదిగా నిరంతరం మేడారానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లు, శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణను ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించిందని తెలిపారు. మేడారం తల్లుల స్ఫూర్తితో సాగిన ప్రజాస్వామ్య పోరాట ఫలితంగానే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సమ్మక్క–సారలమ్మ చెంత మంత్రివర్గ సమావేశం నిర్వహించామని తెలిపారు. జనంకోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చిన వనదేవతల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని అన్నారు. మహాజాతర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని అమెరికా నుంచి ఫోన్ ద్వారా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అధికారులు నిర్విరామంగా అందుబాటులో ఉండి జాతరను వైభవంగా నిర్వహించాలని సూచించారు. గిరిజనులు, ఆదివాసీలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు భక్తిశ్రద్ధలతో వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని, జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. #MedaramJatara #SammakkaSaralamma #TribalFestival #TelanganaCulture #MedaramMahajathara #CMTelangana #NtodayNews #IndianTraditions Follow us on Website Facebook Instagram YouTube